వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే మార్గాలలో ఉన్న వాగులపై వంతెనల నిర్మాణాలు హామీలకే పరిమితమయ్యాయి. మండలంలోని రోటిగూడ-తపాలాపూర్ వాగుపై వంతెన నిర్మిస్తామని 2007లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరలేదు. రోటిగూడ వాగుపై ఉన్న లో లెవెల్ వంతెన స్థానంలో హై లెవెల్ బ్రిడ్జికి నిధులు మంజూరైన ముందుకు సాగడం లేదు. అలాగే మల్యాల, లోతరే, జన్నారం వాగులపై వంతెనలు హామీలుగానే నిలిచిపోతున్నాయి. ప్రతి వర్షాకాలంలో వాగులు వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆయా వాగులపై వంతెనలను త్వరగా నిర్మించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...
