వార్తలకు తిరిగి వెళ్లండి

హాలియాలో బస్టాండ్ నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు ఛైర్మన్ చింతల చంద్రారెడ్డి తెలిపారు.
రోడ్డు నిర్మాణంతో రాకపోకలు సులభతరమవుతాయని, వర్షాకాలంలో బురద సమస్య తగ్గుతుందని పేర్కొన్నారు. వాహనదారులు, పాదచారులకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. పనులు ప్రారంభం కావడంతో స్థానికులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

