వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలిగిద్ద శ్రీ గాయత్రి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు ఆధ్వర్యంలో గురువులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి పూలవర్షం కురిపించారు. “గురువు చూపిన బాటలో నడిస్తే విజయం మన సొంతం..
గురువే మన భవిష్యత్తుకు వెలుగుబాట” అంటూ విద్యార్థులు గురువుల గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

