Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురువాయపాలెం రోడ్డు ప్రమాదం లో డ్రైవర్ మృతి

Follow Udayam on Google
రేఖ దేవి Jul 19, 2026 3:37 PM కడపGeneral
గురువాయపాలెం రోడ్డు ప్రమాదం లో డ్రైవర్ మృతి - Udayam
గురువాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో టమాటా లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి చింత చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన వాహన డ్రైవర్ ఎస్కే అర్షద్ తీవ్రంగా గాయపడి, వాహనంలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై ఎస్.రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...