వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు జ్వరాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. బుధవారం ఉరవకొండలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని తనిఖీ చేసి, జ్వరంతో ఉన్న బాలికలను పరామర్శించారు.
గురుకులంలో ఆరుగురు బాలికలను ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారని చెప్పారు.
Comments
Loading comments...

