Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 12:08 PM శ్రీకాకుళంGeneral
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే - Udayam
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అంబేద్కర్ రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం సాయంత్రం హాస్టల్కు చేరుకున్న ఆయన విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతులపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులు పట్ల ప్రత్యేక సాధించాలని ఆదేశించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...