వార్తలకు తిరిగి వెళ్లండి
దిల్‌సుఖ్‌నగర్‌లో అంబరాన్నంటనున్న గురుపూర్ణిమ వేడుకలు

దిల్‌సుఖ్‌నగర్ శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30 వరకు శ్రీ గురుపూర్ణిమ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఛైర్మన్ డా. లింగయ్య తెలిపారు.
ఈ వేడుకల్లో భాగంగా పవిత్ర నదీ జలాలతో మంగళస్నానాలు, 108 వెండి కలశాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం భారీ అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Comments
Loading comments...