వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ప్రగతినగర్ కాలనీ గత 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని మంగళవారం సీపీఐ నగర కార్యదర్శి అరుణ్‌కుమార్ విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీలు లేక మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు,విషసర్పాల బెడద పెరిగిందని, వర్షాలకు కాలనీ జలమయమవుతోందని స్థానిక మహిళలు వాపోయారు.
అధికారులు వెంటనే రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి నిరాహారదీక్ష చేస్తామని అరుణ్‌కుమార్ హెచ్చరించారు.
Comments
Loading comments...

