వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలోని మర్కజి స్కూల్ సమీపంలోని రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఇటీవల మరమ్మతుల పేరుతో రోడ్డుపై కంకర పోసి వదిలేయడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.
గుంతల కారణంగా వాహనాలు దెబ్బతిని ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

