వార్తలకు తిరిగి వెళ్లండి
గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది.
నిత్యం రద్దీగా ఉండే మండల కేంద్రంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో జంక్షన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

