వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా గుడిపాల మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గోళ్ళ హరిప్రసాద్ చౌదరి అధ్యక్షతన జరిగింది. మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని, భూ రీసర్వేలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు ఎల్‌నినో ప్రభావంపై రైతులను అప్రమత్తం చేయాలని కోరారు.
Comments
Loading comments...

