వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిబండ మండలం దేవరహట్టి పి.గొలహట్టి గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని మహిళలు, గ్రామస్థులు బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో కేశవరెడ్డి అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు.
Comments
Loading comments...

