Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గార్డియన్స్‌ విజేత బ్లాక్‌ హాక్స్‌

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 6:19 AM క్రీడలుక్రీడలు
గార్డియన్స్‌ విజేత బ్లాక్‌ హాక్స్‌ - Udayam
ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌కు చెందిన పది ఫ్రాంచైజీల అండర్‌–21 జట్ల మధ్య గోవాలో జరిగిన గార్డియన్స్‌ ట్రోఫీలో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఆతిథ్య గోవాను ఓడించి టైటిల్‌ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌ జట్టు 15–7, 11–15, 16–14, 15–8తో విజయం సాధించింది. అద్భుత ప్రదర్శన చేసిన బ్లాక్‌ హాక్స్‌ ఆటగాడు సార్థక్‌ సింగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

Comments

G
Loading comments...