Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గట్టుప్పల్‌లో నవరాత్రి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:44 AM నల్గొండGeneral
గట్టుప్పల్‌లో నవరాత్రి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ - Udayam
గట్టుప్పల్‌లోని శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని శుక్రవారం దేవస్థాన పాలకవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధ్యక్షుడు అవ్వారి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నామని జగన్నాథం, కమిటీ సభ్యులు, పురోహితులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...