Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గృహలక్ష్మి బిల్లుల నిలిపివేత: రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు అందజేత

Follow Udayam on Google
md jabeer Sep 10, 2026 8:40 AM నిర్మల్General
గృహలక్ష్మి బిల్లుల నిలిపివేత: రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు అందజేత - Udayam
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి గ్రామానికి చెందిన గౌండ్ల వినోదకు గృహలక్ష్మి పథకం కింద రూ.3,00,000 మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా ఆమె ఇంటి నిర్మాణాన్ని 80 శాతం వరకు పూర్తి చేసుకున్నారు. అయితే ప్రభుత్వం పథకం పేరు మార్చిందని, 'ఇందిరమ్మ ఇల్లు' పథకం అమల్లో ఉందని అధికారులు బిల్లులు నిలిపివేశారు. MPDO కార్యాలయంలో దరఖాస్తును అధికారులు తీసుకోకపోవడంతో, చేసేది లేక ఆమె దరఖాస్తును రిజిస్టర్ పోస్ట్ చేశారు.

Comments

G
Loading comments...