Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లిలో ఘనంగా శ్రీకృష్ణుడి శోభాయాత్ర

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:40 PM సంగారెడ్డిGeneral
గొల్లపల్లిలో ఘనంగా శ్రీకృష్ణుడి శోభాయాత్ర - Udayam
కొండాపూర్‌ మండలం గొల్లపల్లిలో హనుమాన్‌ భక్తజన మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. గ్రామ యువకులంతా ఏకమై స్వామివారి సంకీర్తనలు చేస్తూ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. గత 60 ఏళ్లుగా హనుమాన్‌ ఆలయం, శ్రీకృష్ణ మందిరంలో నిరంతరం భగవద్గీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ముందుంటానని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...