Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా పోచమ్మ బోనాలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 02, 2026 3:16 PM సిద్దిపేటGeneral
ఘనంగా పోచమ్మ బోనాలు - Udayam
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లిలో విశ్వబ్రాహ్మణ, పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మతల్లి బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

Comments

G
Loading comments...