వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా గరుడోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలతో గరుడ వాహనంపై ఊరేగిన స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.
అనంతరం ఆలయ మండపంలో స్వామి, అమ్మవార్లకు 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. జ్యేష్ఠ మాసంలోని స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ఈ జ్యేష్ఠాభిషేకం నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

