Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకోడేరులో పోలీసులకు ఘన వీడ్కోలు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 2:57 PM పశ్చిమగోదావరి General
పాలకోడేరులో పోలీసులకు ఘన వీడ్కోలు - Udayam
జిల్లాలో సోమవారం పదవీ విరమణ చేసిన ఎనిమిది మంది పోలీసు సిబ్బందిని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. 35 నుంచి 40 ఏళ్లపాటు అంకితభావంతో సేవలందించి, ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఉద్యోగ విరమణ చేయడం అభినందనీయమన్నారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...