వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన సోమవారం ఉదయం స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో గోవిందనామస్మరణలు, కోలాటాల నడుమ ఈ దివ్య వాహనసేవ వైభవంగా సాగింది.
అనంతరం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి స్వామివారు ముత్యపుపందిరి వాహనంపై విహరిస్తారని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

