వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి శుక్రవారం గిరిజన మహిళా రైతులతో కలిసి నాట్లు వేశారు. అనంతరం రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుని పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కళావతి, నరేష్, భూషణరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

