Back to feed
గోపీచంద్ కొత్త సినిమా ‘సింగ’.
Ravi Shukla Jun 13, 2026 5:15 AM అల్ ఇండియా 10 views2 days ago

హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నూతన యాక్షన్ చిత్రానికి ‘సింగ’ అనే శక్తిమంతమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి.వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
మలయాళ నటి అనార్కలి నజర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. భావోద్వేగాలు, సరికొత్త డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రం గోపీచంద్‌ను వైవిధ్యమైన మాస్ అవతారంలో ఆవిష్కరించనుందని చిత్రబృందం తెలిపింది.
Comments
Loading comments...



