Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపులాపూర్‌లో పోషకాహార వార్షికోత్సవం

Follow Udayam on Google
Udayam News Sep 25, 2026 5:27 PM జగిత్యాలతెలంగాణ
గోపులాపూర్‌లో పోషకాహార వార్షికోత్సవం - Udayam
గోపులాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-1లో పోషకాహార వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ నీలిమ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య నియమాలపై అవగాహన కల్పించారు. వివిధ పోషకాహార పదార్థాలను ప్రదర్శించి వాటి ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి , సర్పంచ్ , ఉపసర్పంచ్ , అంగన్వాడీ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...