Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వరదతో 28 గ్రామాలకు రాకపోకలు నిలిచివేత

Follow Udayam on Google
Madhu Sep 26, 2026 4:49 PM ములుగుGeneral
గోదావరి వరదతో 28 గ్రామాలకు రాకపోకలు నిలిచివేత - Udayam
వాజేడు మండలంలో గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. చికుపల్లి వద్ద హైదరాబాద్-భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై ఉన్న డైవర్షన్ రోడ్డుపైకి వరదనీరు చేరడంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు మండలంలోని 28 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరు గేజ్ వద్ద శనివారం ఉదయం 11 గంటలకు గోదావరి నీటిమట్టం 14.720 మీటర్లకు చేరి ప్రవహిస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...