Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులకు గుడ్ న్యూస్

కిషోర్ కుమార్ Jul 01, 2026 6:36 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - Udayam Digital
బెంగళూరు- హైదరాబాద్ మధ్య ప్రయాణించే ఆర్టీసీ బస్సులలో మరిన్ని బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లను పెంచారు. అన్ని ఏసీ, నాన్-ఏసీ బస్సులకు ఈ సదుపాయం కల్పించడంతో ప్రయాణికులకు తమకు నచ్చిన చోట బస్సు ఎక్కే అవకాశం లభించింది. టిక్కెట్ల ముందస్తు బుకింగ్ కోసం అధికారిక టీజీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు. ప్రయాణ సౌలభ్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...