వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్ననాటి కలను సాకారం చేసుకున్న వైద్యురాలు స్వాతి!

పాఠశాలలో జరిగిన ఆరోగ్య శిబిరంలో వైద్యుల సేవలు చూసి స్ఫూర్తి పొందిన స్వాతి, ఎనిమిదో తరగతిలోనే డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకుంటూ పట్టుదలతో శ్రమించి ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
ఇటీవల నిర్వహించిన ఐఎన్‌ఐ-సెట్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 23వ ర్యాంకు సాధించి, ప్రతిష్టాత్మక జిప్‌మర్‌లో పీజీ సీటు దక్కించుకున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన లక్ష్యాన్ని చేరుకున్న ఆమె, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.
Comments
Loading comments...