Back to feed
నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్: 1919 నియామక పత్రాల పంపిణీ
Sonia Singh May 11, 2026 1:17 PM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago

తెలంగాణ ప్రభుత్వం 1919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందజేయనుంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ భారీ నియామకాలు చేపట్టారు. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, పార్కింగ్ వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Comments
Loading comments...



