Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు గుడ్ న్యూస్: బకాయిలు విడుదల చేసిన రేవంత్ సర్కార్

Follow Udayam on Google
Rohit Singh May 29, 2026 6:06 PM హైదరాబాద్General
ఉద్యోగులకు గుడ్ న్యూస్: బకాయిలు విడుదల చేసిన రేవంత్ సర్కార్ - Udayam
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ బకాయిల విడుదలను ప్రారంభించింది. మొత్తం రూ.6,000 కోట్ల బకాయిల్లో తొలి విడతగా రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన రూ.4,000 కోట్లను కూడా త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు వంద శాతం పూర్తయ్యాయి. వంద రోజుల్లో బకాయిలు చెల్లిస్తామన్న మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Comments

G
Loading comments...