Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలులో రేపు మాంసం విక్రయాలు బంద్‌

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 2:15 PM కాకినాడGeneral
గొల్లప్రోలులో రేపు మాంసం విక్రయాలు బంద్‌ - Udayam
అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా గొల్లప్రోలులో మాంసాహార విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని కమిషనర్‌ దివిజ సంపతి ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆ రోజు జంతువధశాల, మాంసం, చికెన్‌, చేపల దుకాణాలను మూసివేయాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మాంసాహార విక్రయాలు చేయరాదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...