Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్కొండ హస్తకళలకు గ్లోబల్ బ్రాండ్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 01, 2026 6:24 AM హైదరాబాద్General
గోల్కొండ హస్తకళలకు గ్లోబల్ బ్రాండ్ - Udayam
తెలంగాణ కళాఖండాలైన వెండి ఫిలిగ్రీ, బిద్రి, ఢోక్రా వంటి ఉత్పత్తులను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్త విమానాశ్రయాలు, ప్రధాన నగరాల్లో భారీ షోరూమ్‌లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు లక్షల మంది కళాకారులు ఉపాధి పొందుతున్నారు. ఈ విస్తరణ కార్యక్రమం ద్వారా 2030 నాటికి గోల్కొండ ఉత్పత్తుల విక్రయాలను రూ. 500 కోట్లకు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Comments

G
Loading comments...