వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన ఒక వ్యాపారి 1.089 కేజీల బంగారాన్ని తీసుకుని మోసం చేశాడంటూ ప్రొద్దుటూరుకు చెందిన పలువురు వ్యాపారులు స్థానిక టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు గతంలో కూడా 'తనకంటి జ్యువెలర్స్' శ్రీనివాస్ పేరుతో ఇలాగే మోసాలకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా హైదరాబాద్ సప్లయర్స్ మరియు స్థానిక బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై కేసులు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

