Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ సాయంతో పోయిన చెప్పులు గుర్తించిన గోవా యువకుడు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 5:54 AM జాతీయంGeneral
ఏఐ సాయంతో పోయిన చెప్పులు గుర్తించిన గోవా యువకుడు - Udayam
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయం వద్ద గోవాకు చెందిన శుభాంగ్‌ బోర్కర్‌ తన చెప్పులు పోగొట్టుకున్నారు. వందలాది పాదరక్షల్లో వాటిని గుర్తించేందుకు చాట్‌జీపీటీ సాయం కోరారు. తన క్లాగ్స్‌ ఫొటోతోపాటు అక్కడి పాదరక్షల చిత్రాలను పంపించారు. చిత్రాలను పరిశీలించిన చాట్‌జీపీటీ చెప్పులు ఉన్న నిర్దిష్ట ప్రాంతాన్ని సూచించింది. అక్కడికి వెళ్లి చూడగా తన చెప్పులు కనిపించాయని శుభాంగ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...