Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంట్యాడలో చెరువులోకి దూసుకెళ్లిన కారు.. యువకుడి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 11:37 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కిడాం సమీపంలో బుధవారం అర్ధరాత్రి కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. అదుపుతప్పిన కారు పెద చెరువులోకి వెళ్లడంతో చినమానాపురానికి చెందిన పాశల రమాకాంత్ (34) నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కారును బయటకు తీసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...