Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథునికి సిరిసిల్ల జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Sircilla jilla news Sep 14, 2026 8:11 PM రాజన్న సిరిసిల్లGeneral
గణనాథునికి సిరిసిల్ల జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు - Udayam
సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని, ఉత్సవాల్లో పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించి సహకరించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...