వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఉత్సవ కమిటీలు ప్రభుత్వ సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు ఎలాంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

