వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ట్రాన్స్‌జెండర్లను భాగస్వామ్యం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్లతో సమావేశమైన ఎస్పీ.. విధుల్లో పాల్గొనే 17 మందికి టీ-షర్ట్‌లను అందజేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటం, పోలీసులతో సమన్వయంతో విధులు నిర్వహించడంపై సూచనలు చేశారు.
Comments
Loading comments...

