Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగవరం ప్రజలు శాంతియుతంగా జీవించాలి: సీఐ

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:06 PM పల్నాడు General
గంగవరం ప్రజలు శాంతియుతంగా జీవించాలి: సీఐ - Udayam
గురజాల మండలం గంగవరం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి సీఐ మురళి, ఎస్సై వినోద్ కుమార్ శాంతిభద్రతలపై సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు పోలీసులకు సహకరించాలని గ్రామస్థులను కోరారు.

Comments

G
Loading comments...