Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండ్రాయిలో కారును ఢీకొట్టిన మట్టి ట్రాక్టర్

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:54 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
గండ్రాయిలో కారును ఢీకొట్టిన మట్టి ట్రాక్టర్ - Udayam
జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట నుంచి వల్లభ వైపు వెళ్తున్న కారును మట్టి లోడుతో, అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్లు భయాందోళనకు గురిచేస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లు నెమ్మదిగా వెళ్లాలని కోరారు.

Comments

G
Loading comments...