Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన జర్నలిస్టుల సంక్షేమంపై డిమాండ్

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 4:01 PM ములుగు General
గిరిజన జర్నలిస్టుల సంక్షేమంపై డిమాండ్ - Udayam
గిరిజన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం సంఘం సమావేశం నిర్వహించారు. అర్హులైన గిరిజన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులకు కెమెరాలు, ప్రింట్ మీడియా జర్నలిస్టులకు ల్యాప్‌టాప్‌లు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...