గిరిజన గురుకుల ఫ్యాకల్టీ సమస్యలు పరిష్కరించాలి: TSUTF

గిరిజన గురుకుల ఫ్యాకల్టీ సమస్యలను పరిష్కరించాలని TSUTF ట్రైబల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సురేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కొండాపూర్ గిరిజన బాలుర గురుకులాన్ని సందర్శించి సభ్యత్వ నమోదు ప్రారంభించారు.
పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏ చెల్లించాలని, పార్ట్ టైం టీచర్ల వేతనాలు పెంచాలని ఆయన కోరారు. అనంతరం నూతన కన్వీనింగ్ కమిటీని ప్రకటించారు.
Comments
Loading comments...
