Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గ్రామాల్లో పర్యటించిన గృహ నిర్మాణ శాఖ పీడీ

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 5:49 PM పార్వతీపురం మన్యంGeneral
గిరిజన గ్రామాల్లో పర్యటించిన గృహ నిర్మాణ శాఖ పీడీ - Udayam
పీఎం జన్మన్ పథకం ద్వారా మంజూరైన గృహాల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు సీతంపేట మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం గృహ నిర్మాణ శాఖ పీడీ ధర్మరాజు పర్యటించారు. పీడీ లబ్ధిదారులతో మాట్లాడి, ప్రారంభం కాని గృహాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని సూచించారు. లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించి నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...