Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిన్నిస్ రికార్డు సాధించిన సీఐకి సన్మానం

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 6:05 PM కామరెడ్డిGeneral
గిన్నిస్ రికార్డు సాధించిన సీఐకి సన్మానం - Udayam
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్కు చెందిన సీఐ ఎం.మహేష్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించడంపై గ్రామస్తులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డిలోని వశిష్ట కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో ఆయనను ఆదివారం ఘనంగా సన్మానించారు. లడఖ్ 2,100 కిలోమీటర్ల సాహసోపేత బైక్ యాత్ర చేసి అత్యంత ఎత్తైన ఉమ్లింగ్ పాస్ను అధిగమించినందుకు ఈ గౌరవం దక్కింది.

Comments

G
Loading comments...