వార్తలకు తిరిగి వెళ్లండి

గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన నగరానికి చెందిన చల్లా లలితారాణిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొందు శంకర్ గురువారం సన్మానించారు.
ఆగస్టు 15న బృంద సమన్వయంతో ఊలు అల్లిక పద్ధతిలో 12.18 కి.మీ పొడవైన జాతీయ పతాకాలను అల్లి రికార్డు సృష్టించడంలో ఆమె భాగస్వామ్యమయ్యారు. ఈ ఘనత జిల్లాకు గర్వకారణమని, యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

