వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ సమీపంలోని శ్రీ బంగారు మైసమ్మ సన్నిధిలో కురువ కులస్తుల ఆధ్వర్యంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆడపడుచులు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఒగ్గు కళాకారుల ఆటపాటలు, డప్పు చప్పుళ్లతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి.
పలు పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

