Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా అంగన్‌వాడీ పోషణ మాసం

Follow Udayam on Google
Devender Bale Sep 26, 2026 8:40 PM జగిత్యాలతెలంగాణ
ఘనంగా అంగన్‌వాడీ పోషణ మాసం - Udayam
మోతే-2 అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ నిర్మల గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారం, చిన్నారులకు అందించాల్సిన పోషక విలువల ఆహారంపై అవగాహన కల్పించారు. గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగెపు మహేష్, వైద్యాధికారి శ్రావణి, హెడ్‌మాస్టర్ లత, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...