వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల పట్టణంలోని పలు మద్యం దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్‌లలో తెల్లవారకముందే మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం ప్రియులు పర్మిట్ రూమ్‌ల వద్ద బారులు తీరుతున్నారని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించకపోవడంపై పట్టణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

