Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల కౌన్సిల్‌ సమావేశంలో నేలపై కూర్చొని నిరసన

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:17 AM జోగులాంబ గద్వాల్ General
గద్వాల కౌన్సిల్‌ సమావేశంలో నేలపై కూర్చొని నిరసన - Udayam
గద్వాల మున్సిపల్‌ కార్యాలయంలో ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో 25వ వార్డు కౌన్సిలర్‌ మోహన్‌ యాదవ్‌ వినూత్నంగా నిరసన తెలిపారు. తమ వార్డు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇతర సభ్యులు కుర్చీల్లో కూర్చోగా ఆయన నేలపై కూర్చొని ఛైర్మన్‌ జయలక్ష్మి దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. వార్డులోని మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆయన నిరసన సమావేశంలో చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...