వార్తలకు తిరిగి వెళ్లండి
గురుకుల పాఠశాలలో గ్యాస్ లీకేజీ

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని గురుకుల బాలికల పాఠశాల వంటగదిలో గ్యాస్ లీకేజీ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. భయాందోళనకు గురైన 430 మంది విద్యార్థినులు బయటకు పరుగులు తీయడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
ఈ ప్రమాదంలో వంట సిబ్బందితో పాటు ఒక విద్యార్థినికి గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని తెలిసింది.
Comments
Loading comments...