వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో గ్యాస్ వినియోగదారులు ఈ నెల 15లోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి రఘురాం సూచించారు. గడువులోగా చేయించుకోకపోతే ధ్రువీకరణ పూర్తయ్యే వరకు కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తామని తెలిపారు.
HP పే, ఇండియన్ ఆయిల్ వన్, BPCL యాప్‌ల ద్వారా ఈ-కేవైసీ చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 5,28,051 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 4,95,036 కనెక్షన్లకు ఈ-కేవైసీ పూర్తయిందని తెలిపారు.
Comments
Loading comments...

