వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం వద్ద ఎక్సైజ్ పోలీసులు జరిపిన తనిఖీల్లో మూడు వాహనాల్లో తరలిస్తున్న 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా, సీలేరు ప్రాంతాల నుండి హైదరాబాద్, నల్గొండలకు గంజాయి ని తరలిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి నాలుగు సెల్‌ఫోన్లను కూడా సీజ్ చేశారు.
నిందితులను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు అధికారులు తెలిపారు. గంజాయి సమాచారం కోసం 18004252523 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

